Wednesday, September 2, 2015

hind desh ke nivaasee sabhee jan yek hai... remix wid Aadyanth

Wednesday, July 8, 2015

Wednesday, June 25, 2014

చంద్రుడు దుర్ముహూర్తం లో ఉదయించాడు .. 
మేఘాలు తడారి పోయాయి .. 
భూమాత పొడారి పోయింది .. 
నైరుతి తీరు మారితే 
పవనాల దిక్కు మారింది... 
నీ నవ్వు వెనుక బాధ ని , 
నీ కోపం వెనుక ప్రేమనీ , 
నీ నిశ్సబ్దం వెనుక  కారణాన్ని తెలుసుకొన్న వాడే 
నీకు అసలైన మిత్రుడు ... 
నమ్మకం అంటే 
కనులు చీకటి చూస్తున్నప్పుడు 
మనసు తో కాంతి ని చూడడమే ... 

రాత్రి పడుకొనేముందు  .. 
శ్రీ శ్రీ ని చదువుతూ .. 
ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని అడిగా .. 
ఉదయం లేచి చూస్తే బయటంతా మంచుపూల వాన .. 
ధన్యోస్మి ..

Tuesday, July 16, 2013

20 - 40

ఇరవై ల్లో
నోరుతెరిస్తె విప్లవాలు...
గీత గీస్తే చేగువేరాలు . . .
రాత రాస్తే రుధిరాక్షరాలు . . .
అదేంటో నలభై అన్నా రాలేదు
రక్తం ఘనీభవించింది . . .
కలం కదలడం లేదు . . . 

మనసు

" ఆమె తో పాటూ అక్షరాలన్నీ ఎగిరిపోయాయి . .  మది గది లో అన్నీ తెల్ల కాగితాలే . . ."

 


కురవని మేఘం

" గుండె తడారిపోయింది . . .
నా కళ్ళు వర్షించని మేఘాలు . . .  "


 

Wednesday, May 1, 2013

శిశిరం

శిశిరం  ఐతేనేం ?
నా బాబు నవ్వు కి పూలు వికసిస్తున్నాయి !!!

Monday, November 12, 2012

వీణా మాలిక్



వీణా మాలిక్

Saturday, June 16, 2012

నువ్వెవరా అని ఆలోచిస్తూ
నిరాలోచన గా గోడకానుకొని నీలాకాశంలోనికి చూస్తాను . . .
తెల్లని ఆ  మేఘం నుండి చల్లని వాన చుక్క లా నా అంతరంగం లోనికి జారిపోతావు . . .
పూల కొమ్మను చూస్తూ నిశ్చలం గా నిలబడి పోయినపుడు
పువ్వు ఒడి లోని  పులకరింత లా నా మది లో ప్రవేశిస్తావు . . .
సెలయేటి రాళ్ల పై కూని రాగం నే తీస్తుంటే
అలల జల కన్య లా నను  తాకి పోతావు . . .
నక్షత్ర మార్గం లో నే  పోతుంటే
వెన్నెల మేలి ముసుగు నాపై విసురుతావు . . .
ఎవరని అడిగితే మాత్రం మెరుపులా మాయమవుతావు . . .

Friday, July 8, 2011




నాన్నా నీ అంత   బేద్ద   అయ్యి నీ ఫోన్ లో మాక్కాడతా

Monday, April 11, 2011

ఉత్తరం

ఫోన్ కన్నా నాకు వుత్తరమంటేనే ఇష్టం . . .
అనుభూతుల్ని అలమరా లో దాచుకోవచ్చని . . .

Thursday, March 3, 2011

బాల్యం

చిత్తు కాగితాలు, ఎంగిలిస్తిరాకులు . . . చుట్టూ మూగిన పిల్లలు . . .
బాల్యం మరీ అంత అందమైనదేమీ కాదు . . .

Tuesday, February 8, 2011

స్నేహం

చిన్నప్పటి స్నేహానికి బట్టలే లేవు . .
ఇప్పుడన్నీ రంగు రంగు పరదాలు, ముసుగు చాటు స్నేహాలు . . .

Thursday, January 20, 2011

లేఖ

ఇదిగో నీకోసమే రాస్తున్నా . .
నా మనసనే ఈ లేఖ ని . .
నా మదిలో మెదిలే స్వప్నాల్ని . .
కానీ అన్నిటినీ కాదు
కొన్ని స్వప్నాల్ని దాచి ఉంచా నీకోసమే . .
నువ్వు కలిసినపుడు చూపించి ఎగురవేద్దామని . .
అందుకే వాటినిపుడు రాయను
వాటి రెక్కలు కత్తిరించి కాగితం మీద అంటించను . . .

మీకోసం కొన్ని బుడుగూలు

ప్రియురాలి తో గొడవలు . . .
అలుకలో అందాల కోసం . . .

ఎదురుగా ముసలి బిచ్చగాడు . . .
గోదావరి బొచ్చె లో డబ్బులు . . .

అదే మల్లె తీగ . . అదే వెన్నెల . .
ప్రియురాలి చిరు ముద్దులే లేవు . . .

ఆమె కళ్ళ లో వసంతాలు . .
నా మదిలి గ్రీష్మాలు . .
ప్రేమిస్తున్నానా . . .

చిన్ని మొగ్గ సిగ్గు పడింది . .
పువ్వవ్వ బోతుంది గా మరి . . .

Saturday, November 20, 2010

ప్రతి బింబం

అద్దం నా అసలు ప్రతిబింబం ఏదని అడుగుతుంది . . .
అవును మరి అన్ని అతికించుకొన్న నవ్వులే కదా . . .

Tuesday, August 10, 2010

సెలవు మిత్రమా

నేనున్ననేమి . . లేకున్ననేమి . .
తలపుల వాకిలి తెరిచిన నన్నే కానేదవు
ఎదురుగ ఉన్ననేమి . . లేకున్న నేమి . .
మదిలోని భావాలకు రూపంబిచ్చిన నన్నే పొందగలవు
ప్రాణమున్న నేమి . . లేకున్ననేమి . .
నీ కనురెప్పల మాటున దాగియుండెద నేను
ఈ భువి లో వున్ననేమి . . లేకున్ననేమి . .
నీ ఊహల దివిలో ఎల్లెడలా ఉండగల నంచు
సెలవు మిత్రమా . . మరి సెలవు . .