Tuesday, February 8, 2011

స్నేహం

చిన్నప్పటి స్నేహానికి బట్టలే లేవు . .
ఇప్పుడన్నీ రంగు రంగు పరదాలు, ముసుగు చాటు స్నేహాలు . . .

Thursday, January 20, 2011

లేఖ

ఇదిగో నీకోసమే రాస్తున్నా . .
నా మనసనే ఈ లేఖ ని . .
నా మదిలో మెదిలే స్వప్నాల్ని . .
కానీ అన్నిటినీ కాదు
కొన్ని స్వప్నాల్ని దాచి ఉంచా నీకోసమే . .
నువ్వు కలిసినపుడు చూపించి ఎగురవేద్దామని . .
అందుకే వాటినిపుడు రాయను
వాటి రెక్కలు కత్తిరించి కాగితం మీద అంటించను . . .

మీకోసం కొన్ని బుడుగూలు

ప్రియురాలి తో గొడవలు . . .
అలుకలో అందాల కోసం . . .

ఎదురుగా ముసలి బిచ్చగాడు . . .
గోదావరి బొచ్చె లో డబ్బులు . . .

అదే మల్లె తీగ . . అదే వెన్నెల . .
ప్రియురాలి చిరు ముద్దులే లేవు . . .

ఆమె కళ్ళ లో వసంతాలు . .
నా మదిలి గ్రీష్మాలు . .
ప్రేమిస్తున్నానా . . .

చిన్ని మొగ్గ సిగ్గు పడింది . .
పువ్వవ్వ బోతుంది గా మరి . . .

Saturday, November 20, 2010

ప్రతి బింబం

అద్దం నా అసలు ప్రతిబింబం ఏదని అడుగుతుంది . . .
అవును మరి అన్ని అతికించుకొన్న నవ్వులే కదా . . .

Tuesday, August 10, 2010

సెలవు మిత్రమా

నేనున్ననేమి . . లేకున్ననేమి . .
తలపుల వాకిలి తెరిచిన నన్నే కానేదవు
ఎదురుగ ఉన్ననేమి . . లేకున్న నేమి . .
మదిలోని భావాలకు రూపంబిచ్చిన నన్నే పొందగలవు
ప్రాణమున్న నేమి . . లేకున్ననేమి . .
నీ కనురెప్పల మాటున దాగియుండెద నేను
ఈ భువి లో వున్ననేమి . . లేకున్ననేమి . .
నీ ఊహల దివిలో ఎల్లెడలా ఉండగల నంచు
సెలవు మిత్రమా . . మరి సెలవు . .

పుట్టిన రోజు

నా జీవితం లోనుండి ఇంకో సంవత్సరం వెళ్ళిపోయింది.
పాపం ఇన్ని సంవత్సరాలు గా నన్ను అటు తిప్పి ఇటు తిప్పి,
తిరగేసి మరగేసి చావ చితక్కొట్టి ఎన్నోనేర్పిందీ జీవితం.
కానీ అసలు విషయం ఏంటంటే " నేనే " ఏమీ నేర్చుకోలేదు . . .

Wednesday, July 28, 2010

నీ కోసం

ఓ సాయం సంధ్య వేళ
సముద్రపు ఒడ్డుకెళ్ళి
ఇంత ఇసుక తెచ్చి నా దోసిట్లో నింపి . .
నీ కోసం తెచ్చానను
ఆనందం తో పొంగిపోతాను . . .
నాలుగు గవ్వలేరుకొచ్చి వాటిని దండ గా గుచ్చి
నీ కోసం తెచ్చానను
అందం గా మెడలో ధరిస్తాను
అలల పై తేలియాడే రెండు బుడగలను పట్టి
పొట్లం గా కట్టి నీకోసం తెస్తుంటే పేలిపోయాయని
బుంగమూతి పెట్టు
పక పక మని నవ్వుతాను . . .
మణులు మాణిక్యాలడగను . . చినీ చీనాంబరాలు కోరను
నీ కోసం నేనున్నాననే ఓ చిన్ని గుర్తింపు నిస్తే చాలు
సంతోషపు సాగరాన తెలియాడతా నేస్తం . . .