Sunday, October 5, 2008

మనసు జాడ

నీ మనసు నా గుప్పెట్లో వుందని . . .
నిశ్చింతగా నిదుర పోయాను రాత్రి . . .
ఉదయం లేచి గుప్పెట తెరిస్తే
ఏది . . . ఏముందక్కడ . . .
అది మిగిల్చిన జాడ తప్ప . . .
నాకు నీ జ్ఞాపకాల నీడ తప్ప . . .


నా హృదయం

నా హృదయం ఒక గులాబీ పువ్వు.
అందుకే అది నీ చేతికివ్వడానికి భయపడ్డాను . . .
అది నా పిరికితనమనుకొనేవు . . . ఎంత మాత్రం కాదు
దానికున్న చిన్న ముల్లైనా నిన్ను తాకితే . . .
హమ్మో . . . ఆ ఊహే నేను భరించలేను . . .

ఉత్తరం

నా ఉత్తరం కోసం ఎదురు చూడకు . . .
ఏదో ఒక రోజు నా కలలనన్నిటినీ వ్రాస్తాను
గులాబీరేకుల పై . . .
అందుకే నేనొక గులాబీ చెట్టునవుతున్నా . . .
మరి నా ఊహల పూలు పూయించాలి కదా . . .