Wednesday, July 28, 2010

నీ కోసం

ఓ సాయం సంధ్య వేళ
సముద్రపు ఒడ్డుకెళ్ళి
ఇంత ఇసుక తెచ్చి నా దోసిట్లో నింపి . .
నీ కోసం తెచ్చానను
ఆనందం తో పొంగిపోతాను . . .
నాలుగు గవ్వలేరుకొచ్చి వాటిని దండ గా గుచ్చి
నీ కోసం తెచ్చానను
అందం గా మెడలో ధరిస్తాను
అలల పై తేలియాడే రెండు బుడగలను పట్టి
పొట్లం గా కట్టి నీకోసం తెస్తుంటే పేలిపోయాయని
బుంగమూతి పెట్టు
పక పక మని నవ్వుతాను . . .
మణులు మాణిక్యాలడగను . . చినీ చీనాంబరాలు కోరను
నీ కోసం నేనున్నాననే ఓ చిన్ని గుర్తింపు నిస్తే చాలు
సంతోషపు సాగరాన తెలియాడతా నేస్తం . . .

Sunday, July 11, 2010

సుడి గాలి లో చిరు దీపం . . .

నాకో సమయం వుంది . . తెలుసా . .
అప్పుడు అంతా నేనే . . కానీ ఏదీ పూర్తి గా కాను . .
నేస్తం . . నీకు చెప్పాలని వుంది . .
నీవు నన్ను కనుగొనేప్పటికి
నేను మబ్బు కమ్మిన సూర్యుడిని
కానీ ఆ రోజు ప్రతి నిముషం నన్ను వెలిగించిన అగ్ని రేఖవు నీవు . .
మరి చీకటి పడిన వేళ
ఆ వినీల సంద్రం లో జాబిలమ్మ కాంతి పుంజమై మెరిసావు . .
నేస్తం వెళ్లి పోయావు కదూ నా శ్వాస నీ తోడుగా . . .
అందుకే నేమో నీ లో విలీనమైన అనుభూతి . .
నేస్తం ఏదో చెప్పాలని వుంది కానీ
గుండె గొంతుకు అడ్డు పడుతుంది . . ఏమీ చెప్పలేకపోతున్నా . .
ఈ రాత్రి నీ చిరునవ్వు
నా గుండెల్లో కదలాడే రహస్యాలన్నిటినీ వెల్లడి చేస్తుంది . .
నిజం . .
నేను మాట్లాడలేకపోతున్నా . . . నా భావాలు వర్ణించలేకపోతున్నా . .
నా మనసు నీ తోడుగా . . . మళ్లీ వెళ్లి పోతున్నావు కదూ . .
ఈ రాత్రి దూరమవుతున్న నీ చిరునవ్వు . .
నా శ్వాసను నాకు దూరం చేస్తుంది . .
తిరిగి అంధకారం లోనికి వెళ్ళిపోతున్నా . .

Sunday, July 4, 2010

మరణం చచ్చిపోయింది

దూలానికి వేలాడుతూ నేను . . .
కిటికీ ఊచలు నన్ను చూసి పరిహసిస్తున్నాయి . .
దండానికి ఆరేసిన లుంగీ నుండి చుక్కలు చుక్కలు గా పడుతున్న నీళ్ళు
నా జ్జ్ఞాపకాలు . .
నేనే జీవితం అన్న నా ప్రియసఖి ని కోల్పోయిన
నా గురించి చెబుతున్నాయి . .
దూలానికి వేలాడుతూ నేను . . .
కిటికీ ఊచలు నన్ను చూసి బాధ పడుతున్నాయి
అయ్యో నువ్వింకా చావలేదా అని
చావను . . . ఎందుకంటె నా మరణం చచ్చిపోయింది . . ఇక రాదు
నేనొక జీవచ్చవాన్ని . .