Wednesday, July 28, 2010

నీ కోసం

ఓ సాయం సంధ్య వేళ
సముద్రపు ఒడ్డుకెళ్ళి
ఇంత ఇసుక తెచ్చి నా దోసిట్లో నింపి . .
నీ కోసం తెచ్చానను
ఆనందం తో పొంగిపోతాను . . .
నాలుగు గవ్వలేరుకొచ్చి వాటిని దండ గా గుచ్చి
నీ కోసం తెచ్చానను
అందం గా మెడలో ధరిస్తాను
అలల పై తేలియాడే రెండు బుడగలను పట్టి
పొట్లం గా కట్టి నీకోసం తెస్తుంటే పేలిపోయాయని
బుంగమూతి పెట్టు
పక పక మని నవ్వుతాను . . .
మణులు మాణిక్యాలడగను . . చినీ చీనాంబరాలు కోరను
నీ కోసం నేనున్నాననే ఓ చిన్ని గుర్తింపు నిస్తే చాలు
సంతోషపు సాగరాన తెలియాడతా నేస్తం . . .

1 comment:

Deepa said...

Chala simple ga chepparu
Nija jivitamlo inthe santoshamga unte Anandam vethukkuntu vastundi